అభిమానము లేదేమి



ప. అభిమానము లేదేమి
నీవభినయ వచనములాడేదేమి

1. మాలిమించుకైన లేదా తన్ను
మాలిన ధర్మము కలదా వన
మాలి నాపై దయ రాదా పాలు-
మాలిన గుణమికనైన పోదా (అభి)

2. కలిమియుంటే పెట్టుకోరా కృప
కలుగుననుచు వేడినారా నా
కలవరములు విని రారా
పోకలు నీకు కలదని నేనెరుంగ లేరా (అభి)

3. రాజు నీవని నమ్మినాను గజ
రాజున్న వితము విన్నాను రతి
రాజ దాసుల వేడ లేను త్యాగ-
రాజు నీవాడని పేరు కొన్నాను (అభి)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము