సొగసుజూడ తరమా

            


ప. సొగసు జూడ తరమా నీ

అ. నిగ-నిగమనుచు కపోల
యుగముచే మెరయు మోము (సొ)

1. అమరార్చిత పద యుగము
అభయ ప్రద కర యుగము
కమనీయ తను నిందిత
కామ కామ రిపు నుత నీ (సొ)

2. వర బింబ సమాధరము
వకుళ సుమంబులయురము
కర ధృత శర కోదండ
మరకతాంగ వరమైన (సొ)

3. చిరు నగవులు ముంగురులు
మరి కన్నుల తేట
వర త్యాగరాజ
వందనీయయిటువంటి (సొ)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము