తెలియ లేరు రామ భక్తి మార్గమును

      


ప. తెలియ లేరు రామ భక్తి మార్గమును

అ. ఇలనంతట తిరుగుచును
కలువరించేరు కాని (తె)

చ. వేగ లేచి నీట మునిగి భూతి పూసి
వేళ్ళనెంచి వెలికి శ్లాఘనీయులై
బాగ పైకమార్జన లోలులైరే
కాని త్యాగరాజ వినుత (తె)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము