శ్రీరామ పాదమా నీ కృప చాలునే

   


ప. శ్రీ రామ పాదమా నీ కృప చాలునే
చిత్తానికి రావే

అ. వారిజ భవ సనక సనందన
వాసవాది నారదులెల్ల పూజించే (శ్రీ)

చ. దారిని శిలయై తాపము తాళక
వారము కన్నీరును రాల్చగ
శూర అహల్యను జూచి బ్రోచితివి
ఆ రీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా (శ్రీ)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము