కరుణ జూడవయ్య మాయయ్య కావేటి రంగయ్య

  
ప. కరుణ జూడవయ్య మాయయ్య కావేటి రంగయ్య
అ. పరమ పురుష విను మా పాలి పెను ధనమా
వరద నలుగురిలో వరమొసగి కరమిడి (క)
చ. చేరడేసి కనులచే చెలంగుభయ
నాచ్చారులతోను మరి సద్భక్తులతో
ఆళ్వారులతో నీవు వర నైవేద్యముల-
నారగించు వేళల హరి త్యాగరాజుని కరమిడి (క)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము