చక్కని రాజ మార్గముయుండగ

                                     
                           
                           


పల్లవి: చక్కని రాజ మార్గముయుండగ
సందులదూరనేలే ఓ మనసా
అనుపల్లవి: చిక్కని పాలు మీగడయుండగ
చీయను గంగా సాగరమేలే
చరణం: కంటికి సుందరతరమగు రూపమే ము
క్కంటి నోట చెలగే నామమే త్యాగరా
జింటనే బాగా నెలకొన్న దైవమే యిటు
వంటి శ్రీసాకేతరాముని భక్తియనే

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము