హరియేగతి సకలచరాచరములకును

 


హరియేగతి సకలచరాచరములకును
హరియేగతి విరించి రుద్రాదులకైనా

ముద్దులబాలుడై మురళిని చేపట్టి
బాలమురళివై నాదము పూరించి
ముల్లోకములను మునులను సైతము
మురిపించి మైమరపించి

ఆయా యుగముల ధర్మము నిలుపగ
అవతారములను దాల్చిన దైవము
హయవాహనుడై కలియుగమందున
అలమేలుమంగాపతియై వెలసిన

భస్మాసురులు నమవంచకులు
అసనశూరులు పలుశిశుపాలులు
పట్టిబాధించి యిట్టితరుణమున
పాలనసేయుటకెవరు మాకెవరు

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము