గొబ్బీయళ్ళో సఖియా వినవె


గొబ్బీయళ్ళో సఖియా వినవె
చిన్ని కృష్ణుని సోదరి వినవె
కృష్ణుని చరితము గానారే
శ్రీ కృష్ణుని చరితము గానారే
చరణం : అష్టమినాడు గోకులమందు
చిన్నికృష్ణుని జననమందు
అందరి కోర్కెలు తీర్చేనే
…...గొబ్బియళ్ళో….
కురుపాండవ సమరమందు
దుఃఖితుడైన పార్థుని చూచి
హితమూ చెప్పి వీరుని చేసీ చూపేనే
…...గొబ్బియళ్ళో…..
దరిద్రుడైనా కుచేలునకు
దరిశెనమొసగే ఈ మాధవుడు
ఆతని కోర్కెలు తీర్చేనే
గొబ్బియళ్ళో సఖియా వినవే
చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితము గానరే

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము