శ్రీరామా శ్రిత చింతామణి శుభ నీరాజన జయ హారతిదే

హిందుస్థానీ కాఫీ రాగం – ఆదితాళం

ప:శ్రీరామా శ్రిత చింతామణి శుభ నీరాజన జయ హారతిదే!!శ్రీరామా!!
అ ప: తారాగణ సమ రారాజాన్వయ తారానాధా దాశరధే!!శ్రీరామా!!

చ౧: అగణిత మణిగణ సుగుణ విభూషిత – నగరాజాత్మజ నాధనుతా
భోగయుతా త్యాగిహితా ఆగమసన్నుత అయమహితా!!శ్రీరామా!!

చ౨: వానర సన్నుత వరముని సేవిత భానువంశ భవ భయ రహితా
గానరతా దీనహితా మానవభావిత మాసహితా!!శ్రీరామా!!

చ౩. శూరాదనుజ సం-హారా నగసమ-ధీరా భక్త మందార హరా
బీజపురా గారచారా నరసింహార్చిత నవమారా!!శ్రీరామా!!

Comments

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట