మంగళంబే శంభురాణీ మానిని ఓ పువ్వు బోణీ

మంగళంబే శంభురాణీ మానిని ఓ పువ్వు బోణీ
భ్రుంగు కుంతల వేణివమ్మా – పుత్తడీ బంగారు బొమ్మా
నిన్నె గొల్చుచుంటినమ్మా – నీదు కరుణ జూపవమ్మా!!మంగళంబే!!

మల్లెపూలు తెచ్చి నిన్ మగువరొ పూజిస్తునమ్మా
యుల్లమందు మరువకమ్మా ఉవిదరొ దయజూడవమ్మా!!మంగళంబే!!

దోషములను ఎంచకమ్మా దోసిలొగ్గి ఉంటినమ్మా
కాశివిశ్వేశ్వరుని కొమ్మా – కనికరించ సమయమమ్మా!!మంగళంబే!!

అంగనలొసగేటి శుభమంగళములనందవమ్మా
రంగదాసు నేలినట్టి రాణీ వరమీయవమ్మా!!మంగళంబే!!


Comments

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట