ఏ కులజుడైననేమి యెవ్వడైననేమి


ఏ కులజుడేమి యెవ్వడైననేమి
ఆకడ నాతడె హరినెఱిగినవాడు

పరగిన సత్యసంపన్నుడైన వాడే
పరనిందసేయ తత్పరుడు గాని వాడు
అరుదైన భూతదయానిధి యగువాడే
పరులదానే యని భావించువాడు

నిర్మలుడై యాత్మనియతి గలుగువాడే
ధర్మతత్పరబుధ్ధి తగిలిన వాడు
కర్మమార్గములు తడవనివాడే
మర్మమై హరిభక్తి మఱవనివాడు

జగతి పై హితముగా చరియించువాడే
పగలేక మతిలోన బ్రతికినవాడు
తెగి సకలము ఆత్మ తెలిసినవాడే
తగిలి వెంకటేశు దాసుడయినవాడు

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము