తెలియ చీకటికి దీపమెత్తక, పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా


ప|| తెలియ చీకటికి దీపమెత్తక, పెద్ద | వెలుగు లోపలికి వెలుగేలా ||
చ|| అరయ నాపన్నుని కభయ మీవలెగాక | ఇరవైన సుఖి గావనేలా |
వరుత బోయెడువానివడి దీయవలె గాక | దరివాని తివియ(గ దానేలా ||
చ|| ఘనకర్మారంభుని కట్లు విడవలె గాక | యెనసి ముక్తుని గావనేలా |
అనయము దుర్బలుని కన్న మిడవలెగాక | తనిసిన వానికి దానేలా ||
చ|| మితిలేని పాపకర్మికి దావలె గాక | హిత మెరుగు పుణ్యునికి నేలా |
ధృతిహీను గృపజూచి తిరువేంకటేశ్వరుడు | తతి గావకుండిన తానేలా ||

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

రామరామరామ యన్న రామచిలుక ధన్యము

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం