అరుణాచలనాథం స్మరామి అనిశం (సారంగరాగం) – దీక్షితార్ కృతి
పల్లవి
అరుణాచల నాథం స్మరామి అనిశం
అపీత కుచాంబా సమేతమ్
అనుపల్లవి
స్మరణాత్ కైవల్యప్రద చరణారవిందం
తరుణాదిత్య కోటిసంకాశ చిదానందం
కరుణా రసాది కందం శరణాగత సుర బృందమ్
చరణం
అప్రాకృత తేజోమయ లింగం
అత్యద్భుత కరధృతసారంగం
అప్రమేయం అపర్ణాబ్జ భృంగం
ఆరూఢోత్తుంగ వృష తురంగమ్
విప్రోత్తమ విశేషాంతరంగం
వీర గురు గుహ తార ప్రసంగం
స్వ-ప్రదీప మౌలి విధృత గంగం
స్వ-ప్రకాశ జిత సోమాగ్ని పతంగమ్
అపీతకుచాంబా సహితం