నే పొగడకుంటే నీకేమి కొదవో





ప. నే పొగడకుంటే నీకేమి కొదవో
నీ మనసు తెలిసె కదరా ఓ రామ

అ. ప్రాపు కల శుక సనక ప్రహ్లాద నారద
పరమేశ రుద్రాది భక్తులర్చింపగ (నే)

చ. భుజియింప పెట్ట సతి బుధులు సామాజికులు
భజియింప సోదరులు పవన సూనుడజ
బిడౌజాది సురులాప్తులైనారు
నీరజ నయన శ్రీ త్యాగరాజ నుత బాలుడగు (నే)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము