ఎవ్వరెవ్వరివాడో యీ జీవుడు చూడనెవ్వరికి నేమౌనో ఈ జీవుడు!


ఎవ్వరెవ్వరివాడో యీ జీవుడు చూడనెవ్వరికి నేమౌనో ఈ జీవుడు!

ఎందరికి కొడుకుగాడీ జీవుడు వెనుక కెందరికి తోబుట్టుడీ జీవుడు

యెందరిని భ్రమయించడీ జీవుడు దుఃఖమెందరికి గావింపడీ జీవుడు

ఎక్కడెక్కడ దిరుగడీ జీవుడు వెనుక కెక్కడో తన జన్మమీ జీవుడు

యెక్కడి చుట్టము తనకు నీ జీవుడు వెనుక కెన్ని తనువులు మోవడీ జీవుడు

యెన్నగల తిరువేంకటేశు మాయల దగిలి యెన్ని పదవుల బొందడీ జీవుడు!!

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము