తానె తానే యిందరి గురుడు
ప|| తానె తానే యిందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞాన యోగి || చ|| అపరిమితములైన యజ్ఞాల వడిజేయ బ్రపన్నులకు బుద్ధి వచరించి తపముగా ఫలత్యాగము సేయించు కపురుల గరిమల కర్మయోగి || చ|| అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి ఉన్నతపదమున కొనరగ గరుణించు పన్నగశయనుడే బ్రహ్మయోగి || చ|| తనరగ గపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై ఒనరగ సంసార యోగము గృపసేయు అనిమిషగతులను అభ్యాసయోగి ||