Posts

తెలియ లేరు రామ భక్తి మార్గమును

Image
       ప. తెలియ లేరు రామ భక్తి మార్గమును అ. ఇలనంతట తిరుగుచును కలువరించేరు కాని (తె) చ. వేగ లేచి నీట మునిగి భూతి పూసి వేళ్ళనెంచి వెలికి శ్లాఘనీయులై బాగ పైకమార్జన లోలులైరే కాని త్యాగరాజ వినుత (తె)

నీదు చరణములే గతియని

Image
                    ప. నీదు చరణములే గతియని నెర నమ్మిన వాడనురా రామ అ. వేద వేదాంత విదితుడని వెలయు సర్వేశ రామ (నీ) చ. పాప కర్మము నిండురా యిందు బాధ పడ నే జాలరా ఏ వగగానైనను నన్నేలుకో త్యాగరాజ నుత (నీ)

చరణములే నమ్మితి

Image
ప: చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చ 1: వారధి గట్టిన వర భద్రాచల వరదా వరదా వరదా నీ దివ్య || చరణములే || చ 2: ఆదిశేష నన్నరమర చేయకు మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే || చ 3: వనమున రాతిని వనితగ జేసిన చరణం చరణం చరణం నీ దివ్య || చరణములే || చ 4: పాదారవిందమే యాధారమని నేను పట్టితి పట్టితి పట్టితి నీ దివ్య || చరణములే || చ 5: వెయ్యారు విధముల కుయ్యాలించిన అయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే || చ 6: బాగుగ నన్నేలు భద్రాచల రామ దాసుడ దాసుడ దాసుడ నీ దివ్య || చరణములే ||

కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ రంగ

Image
                            కస్తూరి రంగ రంగ -నాయన్న కావేటి రంగ రంగ శ్రీరంగ రంగ రంగ నిన్ను బాసి - యెట్లునే మరచుందురా కంసు ణ్ణి సంహరింపా- సద్గురుడు అవతారమెత్తెనపుడూ దేవకీ గర్భమునను-కృష్ణావవతారమై జన్మించెను యేడు రాత్రులు చే రిచి -ఒక రాత్రి ఏక రాత్రిగ జేసెను ఆదివారము పూటను-అష్టమీ దినమందు జన్మించెను తలతోను జన్మమైతే- తనకు బహు -మోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్లను బుట్టెను , ఏడుగురు- దాదులను జంపెనపుడు!! నెత్తురుతో ఉండి యపుడు - ఆ బాల క్యావు క్యావున ఏ డ్చెను నన్నేల ఎత్తుకొనవే -ఓ తల్లి దేవకీ వందనంబు ఒ ళ్ళెల్ల హీనంబుతో -ఈ రీతి ను న్నాను కన్న తండ్రి. నిన్నెట్లు యెత్తుకొందు-నీ వొక్క నిముషంబు తాళరన్న !! గంగను ప్రార్థించెను -జలనిధుల – గంగ తానుప్పొంగెను గంగ నదిలోనప్పుడు- దేవకీ జలకంబులాడెనపుడు ఇకనైన ఎత్తుకొనవే - నాతల్లి దేవకీ వందనంబు కాని బాలుని వలేను - నన్నిట్ల ఎడబాసి యుండతగునా !! నీపుణ్యమాయె కొడకా- ఇంకొక్క నిముషంబు తాళ మను చు కామ...