Posts

కనక శైల విహారిణి

Image
            రాగం: పున్నాగవరాళి తాళం: ఆది శ్యామశాస్త్రి కృతి ప: కనకశైల విహారిణీ అంబా కామకోటి బాలే సుశీలే అ.ప: వనజ భవ హరి నుతే దేవి హిమ గిరిజే లలితే సతతం | వినతం మాం పరిపాలయ శంకర వనితే సతిమహా త్రిపుర సుందరి || ౧. శామలాంబికే భవాబ్ది తరణే శ్యామకృష్ణ పరిపాలిని జననీ | కామితార్థ ఫల దాయకి కామాక్షి సకల లోక సాక్షి      

దేవి బ్రోవ సమయమిదే

Image
                  రాగం: చింతామణి తాళం: ఆది శ్యామశాస్త్రి కృతి ప: దేవి బ్రోవ సమయమిదే అతి వేగమె వచ్చి అనుపల్లవి: నా వెతలు దీర్చి కరుణించవే శంకరి కామాక్షి 1. లోక జనని నాపై దయలేదా నీ దాసుడు గాద శ్రీ కంచి విహారిణి కళ్యాణి ఏకామ్రేశ్వరుని ప్రియ భామయైయున్న నికేమమ్మయంతో భారమా వినుమా నాతల్లి 2: రేపు మాపని చెప్పితే నే వినను ఇక తాళను ఈ ప్రొద్దు దయ సెయవే కృప జూడవే నీ పదాబ్జములే మదిలో సదా ఎంచి ప్రాపు కోరియున్ననమ్మ ముదముతో మా తల్లి 3: శ్యామ కృష్ణ సోదరి కౌమారి బింబాదరి గౌరి హేమచాలజే లలితే పరదేవతే కామాక్షి నిన్నువిన భువిలో ప్రేమతో కాపాఢేవారెవరున్నరమ్మ వినుమా మా తల్లి

మహా గణపతిం మనసాస్మరామి

Image
మహా గణ పతిం మనసా స్మరామి వసిష్ఠ వామ దేవ-ఆది వందిత!! మహా దేవ సుతం గురు గుహ నుతం మార కోటి ప్రకాశం శాంతం మహా కావ్య నాటక-ఆది ప్రియం మూషిక వాహన మోదక ప్రియమ్

చింతయ మాకంద మూలకందం

              రాగం:భైరవి తాళం : రూపకం ప: చింతయ మా కంద మూలకందం చేతహ్ శ్రీ సోమాస్కందం అ.ప: సంతతం అఖండ సచ్చితానందం సమ్రాజ్యప్రద చరణారవిందం చ: మంగళకర మందహాస వదనం మాణిక్యమయ కాంచిసదనం అంగ సౌందర్య విజిత మదనం అంతక సూదనం రదనం ఉత్తుంగ కమనీయ వృష తురహంగం భైరవి ప్రసంఘం గురుగుహాంతరంగం పృథ్వీలింగం

ఉదయాద్రి తెలుపాయె ఉడు రాజు కొలువీడె

ప|| ఉదయాద్రి తెలుపాయె ఉడు రాజు కొలు వీడె | అద నెరిగి రాడాయె నమ్మ నా విభుడు || చ|| చన్నులపై ముత్యాల సరులెల్ల జల్లనాయె | కన్నులకు గప్పొదవె గాంత నా కిపుడు | కన్నె కలువల జాతి కనుమోడ్చినది మీద | వెన్నెల వేసంగి మొగ్గ వికసించె గదవె || చ|| పువ్వుల లోపలి కురులు బుగులు కొనగా నెర్కసె | దవ్వుల దుమ్మెదగములు తరమి డాయగను | రవ్వసేయ శుక పికము రాయడి కోర్వగ రాదు | అవ్వలనెవ్వతె పసల కలరున్నవాడో || చ|| పన్నీట జలక మార్చి పచ్చకప్రము మెత్తి | చెన్ను గంగొప్పున విరులు చెలువందురిమి | ఎన్నంగల తిరువేంకటేశుం డిదె ననుంగూడి | కన్నుల మనసునుం దనియం గరుణించెం గదవే ||

దుడుకుగల నన్నే

Image
                                            ప. దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో (దు) అ. కడు దుర్విషయాకృష్టుడై గడియ గడియకు నిండారు (దు) స్వర సాహిత్య - 1. శ్రీ వనితా హృత్కుముదాబ్జ అవాఙ్-మానస గోచర (దు) 2. సకల భూతములయందు నీవై- యుండగ మతి లేక పోయిన (దు) 3. చిరుత ప్రాయము నాడే భజనామృత రస విహీన కు-తర్కుడైన (దు) 4. పర ధనముల కొరకునొరుల మది కరగ పలికి కడుపు నింప తిరిగినట్టి (దు) 5. తన మదిని భువిని సౌఖ్యపు జీవనమే- యనుచు సదా దినములు గడిపే (దు) 6. తెలియని నట-విట క్షుద్రులు వనితలు స్వ-వశమౌటకుపదేశించి సంతసిల్లి స్వర లయంబులెరుంగకను శిలాత్ములై సు-భక్తులకు సమానమను (దు) 7. దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను దేవ దేవ నెర నమ్మితిని గాకను పదాబ్జ భజనంబు మరచిన (దు) 8. చక్కని ముఖ కమలంబును సదా నా మదిలో స్మరణ లేకనే దుర్మదాంధ జనుల కోరి పరిత...

పరిదానమిచ్చితే పాలింతువేమో

Image
                            ప: పరిదానమిచ్చితే పాలింతువేమో అ.ప: పరమ పురుషా శ్రీపతి నాపై నీకు కరుణ గల్గగయున్న కారణమేమయ్యా ౧. రొక్కమిచ్చుటకు నే ముక్కంటి చెలికాను చక్కని చెలినొసగ జనకరాజును గాను మిక్కిలి సైన్యమివ్వ మర్కటేంద్రుడు గాను ఆల్కటికమేటు గల్గు ఆది వేంకటేశ్వర నీకు!!