Posts

కృష్ణం కలయ సఖీ సుందరం

Image
                      ప: కృష్ణం కలయ సఖీ సుందరం బాల కృష్ణం కలయ సఖీ సుందరం!! అ.ప: కృష్ణం గతవిషయ తృష్ణమ్ జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా!!బాల!! ౧. నృత్యంత మిహ ముహురత్యంత మపరిమిత భృత్యానుకూలమఖిల సత్యం సదా!!బాల!! ౨. ధీరం భవజలధి పారం సకలవేద సారం సమస్తయోగి తారం సదా!!బాల!! ౩. శృంగారరసభర సంగీత సాహిత్య గంగాలహరీఖేల సంగం సదా!!బాల!! ౪. రామేణ జగదభి రామేణ బలభద్ర రామేణ సహావాప్త కామేన సదా!!బాల!! ౫. రాధారుణాధర సుధాపం సచ్చిదానంద రూపం జగత్త్రయ భూపం సదా!!బాల!! ౬. దామోదర మఖిల కామాకారం ఘన శ్యామాకృతి మసుర భీమం సదా!!బాల!! ౭. అర్థం శిథీలీకృతా నర్థం శ్రీనారాయణ తీర్థంపరమపురుషార్థం సదా!!బాల!!

నల్లని మేని నగవు చూపుల వాడు

Image
                   ప || నల్లని మేని నగవు చూపుల వాడు | తెల్లని కన్నుల దేవుడు || చ || బిరుసైన దనుజుల పింఛమణచినట్టి | తిరుపు కైదువ తోడి దేవుడు | సరిపడ్డ జగమెల్ల చక్క ఛాయకు దెచ్చి | తెరవు చూపినట్టి దేవుడు || చ || నీటగలసినట్టి నిండిన చదువులు | తేట పరచినట్టి దేవుడు | పాటిమాలినట్టి ప్రాణుల దురితపు | తీట రాసినట్టి దేవుడు || చ || గురుతువెట్టగరాని గుణముల నెలకొన్న | తిరువేంకటాద్రిపై దేవుడు | తిరముగ ధృవునికి దివ్యపదంబిచ్చి | తెరచి రాజన్నట్టి దేవుడు ||

మంగళము గోవిందునకు

ప మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకూ , జయజయ చ ఆదికినినాదైనదేవున కచ్యుతున కంభోజణాభున- కాదికూర్మంబై నజగదాధారమూర్తికిని వేదరక్షకునకును సంతతవేదమార్గ విహారునకు బలి- భేదికిని సామాదిగానప్రియవిహారునకు చ హరికి బరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్ఠునకు కరుణా- కరునకును గాత్యాయనీనుతకలితనామునకు చ పంకజాసనవరదునకు భవపంకవిచ్ఛేదునకు భవునకు శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు వేంకటాచలవల్లభునకుమ విశ్వమూర్తికి నీశ్వరునకును పంకజాకుచకుంభకుంకుమ పంకలోలునకు

మంగాంబుధి హనుమంతా

Image
                          పల్లవిః మంగాంబుధి హనుమంతా నీ శరణ మంగవించితిమి హనుమంతా చరణం; బాలార్క బింబము ఫలమని ప ట్టిన ఆలరి చేతల హనుమంతా తూలని బ్రహ్మాదులచే వరములు ఓలి చేకొనినా హనుమంతా ప పమగమ మగరిగ గరిసరి రిసనిస సరిసని సరిగ రిసా రిగామ గరీ గమాప మగరిగమప పమగమపద దపమపదని నిదపదనిస సనిదనిసరి గరినిద మదనీద నినిదమ గమదామ నిదమగరిగ "మ0గా" చరణం జలధి దాట నీ సత్వము కపులకు అలరి తెలిపితివి హనుమంతా ఇలయు నాకసము నేకముగా, నటు బలిమి పెరిగితివి భళి హనుమంతా చరణం పాతాళము లోపలి మైరావణు ఆతల జంపిన హనుమంతా చేతులు మోడ్చుక శ్రీ వేంకటపతి నీ తల గోలిచే హిత హనుమంతా ప తకితతామ్ తకితజామ్ తకితజుమ్ తకితతొమ్ తరితజుమ్ సరిగ తజుమ్ రిగమ తజుమ్ గమప కితకు గమప కుకుమ్ గమపద ఝనకు పదని సరిత ఝనుత ఛనుత నిసరి కుకుమ్ ఘనుకుత నీద తనకు తరితగామ తరితఝనుత "మ0గ"

మంగళం వర ఋష్యశృంగ నగర వాసినీ

Image
             మంగళం వర ఋష్యశృంగ నగరవాసినీ !  మంగళం సురత్నభూషణానిభాసినీ! దంతకాంతినిర్ధుతాచ్ఛకుందడంబరే  శాంతచిత్త సేవ్యమానపాదపంకజే!! శంకరాయ రచిత దివ్య చక్ర మధ్యగే!  కింకరాయితామరేంద్ర ముఖ్య దేవతే! పాదనమ్ర లోక సర్వ కాంక్షితార్థయే!  మోదమక్షయిష్ణుమంబా దేహి శారదే!! పాహి శారదే! శ్రీ శారదే!!