Posts

చక్కని రాజ మార్గముయుండగ

Image
                                                                                              పల్లవి: చక్కని రాజ మార్గముయుండగ సందులదూరనేలే ఓ మనసా అనుపల్లవి: చిక్కని పాలు మీగడయుండగ చీయను గంగా సాగరమేలే చరణం: కంటికి సుందరతరమగు రూపమే ము క్కంటి నోట చెలగే నామమే త్యాగరా జింటనే బాగా నెలకొన్న దైవమే యిటు వంటి శ్రీసాకేతరాముని భక్తియనే

కరుణ జూడవయ్య మాయయ్య కావేటి రంగయ్య

Image
   ప. కరుణ జూడవయ్య మాయయ్య కావేటి రంగయ్య అ. పరమ పురుష విను మా పాలి పెను ధనమా వరద నలుగురిలో వరమొసగి కరమిడి (క) చ. చేరడేసి కనులచే చెలంగుభయ నాచ్చారులతోను మరి సద్భక్తులతో ఆళ్వారులతో నీవు వర నైవేద్యముల- నారగించు వేళల హరి త్యాగరాజుని కరమిడి (క)

సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే

Image
                 సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే | | సీతా | | అనుపల్లవి పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవిసోమ వరనేత్ర రమణీయ గాత్ర | | సీతా | | చరణము 1 భక్తజన పరిపాల భరిత శరజాల భుక్తి ముక్తిద లీల భూదేవ పాల | | సీతా | | చరణము 2 పామరా సురభీమ పరిపూర్ణ కామ శ్యామ జగదభిరామ సాకేతధామ | | సీతా | | చరణము 3 సర్వలోకాధార సమరైకధీర గర్వమానసదూర కనకాగధీర | | సీతా | | చరణము 4 నిగమాగమ విహార నిరుపమ శరీర నగధ విఘవిదార నత లోకాధార | | సీతా | | చరణము 5 పరమేశనుత గీత భవజలధి పోత తరణికుల సంజాత త్యాగరాజనుత | | సీతా |

కొలిచిన వారల కొంగుపైడితడు

ప || కొలిచిన వారల కొంగుపైడితడు | బలిమి తారక బ్రహ్మమీతడు || చ || ఇనవంశాంబుధి నెగసిన తేజము | ఘనయజ్ఞంబుల గల ఫలము | మనుజరూపమున మనియెడి బ్రహ్మము | నినుపుల రఘుకుల నిధానమీతడు || చ || పరమాన్నములోపలి సారపుజవి | పరగినదివిజుల భయహరము | మరిగినసీతా మంగళసూత్రము | ధరలో రామావతారంబితడు || చ || చకితదానవుల సంహారచక్రము | సకల వనచరుల జయకరము | వికసితమగు శ్రీవేంకట నిలయము | ప్రకటిత దశరథ భాగ్యంబితడు ||

శ్రీరామ జయరామ శృంగార రామయని

ప:   శ్రీరామ జయరామ శృంగార రామయని చింతించరాదే ఓ మనసా 1. తళుకు జెక్కుల ముద్దు బెట్ట కౌసల్య మును తపమేమి చేసెనో తెలియ 2. దశరధుడు శ్రీరామ రా రా యని బిలువ మును తపమేమి చేసెనో తెలియ 3. తనివారి పరిచర్య సేయ సౌమిత్రి మును తపమేమి చేసెనో తెలియ 4. తనవెంత జన జూచి యుప్పొంగ కౌసికుడు తపమేమి చేసెనో తెలియ 5. తాపమణగి రూపవతియౌట కహల్య త పమేమి చేసెనో తెలియ 6. ధర్మాత్మ చరణంబుసోక శివచాపము తపమేమి చేసెనో తెలియ 7. తన తనయ నొసగి కనులార జనకుండు   తపమేమి చేసెనో తెలియ 8. దహరంబు కరుగ కరమునుబట్ట జానకి   తపమేమి చేసెనో తెలియ 9. త్యాగరాజాప్త యని బొగడ నారదమౌని తపమేమి చేసెనో తెలియ