Posts

మనసౌనే ఓరాధా మరల వేణువూద

మనసౌనే ఓరాధా మరల వేణువూద ఘన శ్యామ సఖి శంపాంగనవై నర్తింపరాద!!    మందలోని గోవులు మైమరచి మోరలెత్తి చూడ బృందావని గడప గడప, అందెలు ఘల్లుమని యాడ, చిందులలరు పదములు కాళిందీ తటమందు కూడ సుందర గోపీ మండల మందు నిలిచి నీవు పాడ!!    ప్రతి నయనద్వయి నాపై, ప్రణయామృత ధార కురియ, ప్రతి యెడంద నవ విద్యుల్లతయై నాహృదయ మొరయ, ప్రతి వనమ్ము ప్రతి కుంజము, శ్రుతి లయాన్వితమై విరియ,  ప్రతి స్వరమ్ము ప్రతి మూర్చన, ప్రణవ మంత్ర మౌచు మొరయ!!  (‘స్వైరిణి’ నాటిక నుండి. 1959) https://youtu.be/CH8XLlG7ug8?si=OXMYDbgOyuGm-5PY

ఆల్బమ్ - 032 మధురం మధురం

సంపుటి 2 -  137.  01. మధురం మధురం శివచరితం శ్రీకరం సుందరం  మనసారా పాడుకుందాం శివచరితం సృష్టిస్థితిలయలన్నిటి హేతువు చిదానందమీ శివచరితం వేదపురాణములఖిల శాస్త్రములు వివరించినదీ శివచరితం ధ్యానము యోగము జ్ఞానము గానము అంతా తానే శివచరితం మననం స్మరణం శరణం తరణం మహనీయమ్మిది శివచరితం కనగా కనగా కమనీయంబిది కలికలుషహరం శివచరితం  వినగా వినగా రమణీయంబిది వేదనలనణచే శివచరితం దేవతలందరు సన్నుతిచేసే దివ్యపథమ్మిది శివచరితం పారాయణమున పరమపదమ్మిడు పరమమంత్రమయ శివచరితం బ్రహ్మమురారిసురార్చితమైనది బహువిధ మహిమల శివచరితం జాగులు లేకనె జగద్రక్షణకు జాగృతమైనది శివచరితం  గళమున గరళము దాల్చిన నాథుని కరుణను తెలిపెడి శివచరితం  నాట్యవిరాజవిలాస నిలయమై నాదమయమ్మీ శివచరితం త్రిపురాసురసంహారకమైనది తేజోమయమీ శివచరితం గంగాధరునిగ గౌరీధవునిగ శృంగారితమీ శివచరితం సగుణమ్మైనది నిర్గుణమైనది సకలము అకలము శివచరితం ఆద్యంతమ్ములు దొరకని జ్యోతిగ అవతరించినది శివచరితం సౌరాష్ట్రమ్మున సోమనాథునిగ సాక్షాత్కారం శివచరితం శ్రీశైలమ్మున మల్లికార్జునుని చిజ్ఞ్యోతిర్మయ శివచరితం ఉజ్జయినీపురి మహాకాలునిగ ఉజ్జ్వలమైనది శివచరితం ఓంకారమ్మమలేశ్వరదీప్తిగ ఉద్భవించినది శివచరి

బాలాంబికాయా పరం నహిరే

Image
బాలాంబికాయా పరం నహిరే రే చిత్త భారతీ రమా సేవితాయా శ్రీ!! అ.ప – బాలేన్దు జిత ముఖ పఙ్కజాయా భానుకోటి కోటి లావణ్యాయా!! ౧.   భూసురాది త్రిసహస్ర మునీశ్వర పూజిత పరదేవతాయా భవరోగహర వైద్యపతీశ్వర సుఖకర్యా గురుగుహ జనన్యా భాసమాన వైద్యపురీశ్వర్యా వాఞ్ఛితఫలప్రదేశ్వర్యా ఫుల్లకల్హారమాలాదిధారిణ్యా నిరఞ్జన్యా!!    

ఎవ్వరెవ్వరివాడో యీ జీవుడు చూడనెవ్వరికి నేమౌనో ఈ జీవుడు!

Image
ఎవ్వరెవ్వరివాడో యీ జీవుడు చూడనెవ్వరికి నేమౌనో ఈ జీవుడు! ఎందరికి కొడుకుగాడీ జీవుడు వెనుక కెందరికి తోబుట్టుడీ జీవుడు యెందరిని భ్రమయించడీ జీవుడు దుఃఖమెందరికి గావింపడీ జీవుడు ఎక్కడెక్కడ దిరుగడీ జీవుడు వెనుక కెక్కడో తన జన్మమీ జీవుడు యెక్కడి చుట్టము తనకు నీ జీవుడు వెనుక కెన్ని తనువులు మోవడీ జీవుడు యెన్నగల తిరువేంకటేశు మాయల దగిలి యెన్ని పదవుల బొందడీ జీవుడు!!

దేవీం ప్రణమామ్యహమ్ (ఋషిపీఠం విశిష్టసంచిక) 2004

Image
హిందూ సంప్రదాయములో శ్రీదేవీ నవరాత్రులకు విశిష్ట ప్రాధాన్యం ఉన్నది . మన భారతదేశంలో ఈ దేవీ పూజలు వేదకాలం నుంచే ఉన్నాయనడానికి ఋగ్వేదంలోని దేవీసూక్త , రాత్రిసూక్తాదులే నిదర్శనం . బ్రాహ్మణములు , అరణ్యకములు , ఉపనిషత్తులలో కూడా దేవీ ప్రస్తావన విరివిగా ఉన్నది . మహాభారతంలో దుర్గాదేవి స్తుతి ఉన్నది . స్కాంద , మత్స్య , వామన , వరాహాది పురాణాలలో దేవీవృత్తాంతం కనిపిస్తున్నది . దేవీ భాగవతం శ్రీదేవీ ప్రాశస్త్యాన్ని వేనోళ్ళ కొనియాడుతున్నది . దేవీ నవరాత్రులు రెండు రకాలుగా జరుగుతాయి . చైతశుద్ధ విదియ మొదలు నవమి వరకూ చేసే నవరాత్రులను వసంత నవరాత్రులని , ఆశ్వయుజ శుద్ధ విదియ మొదలు నవమి వరకూ చేసే నవరాత్రులను శరన్నవరాత్రులని పిలుస్తారు . ఈ రెండింటిలోను శరన్నవరాత్రులకే దేవీనవరాత్రులని ప్రసిద్ధి . ఈ శరన్నవరాత్రులలో దేవీపూజలను తొమ్మిది రోజులు చెయ్యడానికి కారణం భవిష్యపురాణం , దేవీపురాణము , మార్కండేయ పురాణములలో చెప్పబడింది . దుష్టశిక్షణ , శిష్టరక్షణ చేయడానికి ఆదిశక్తి అయిన జగన్మాత తొమ్మిది అవతారాలను ధరించింది . అవి మహాకాళి , మహిషాసురమర్దిని , చాముండ , నంద , రక్తదంతి , శాకంభరి , దుర్గ , మాతంగిని , భ్రామరి అన